పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుది. రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర పై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్(25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో షేక్ అజారుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
రామగుండానికి చెందిన మృతుడు ఎన్టీపీసీలోని గరుడ మోటర్ షొరూంలో మెకానిక్ గా పని చేస్తున్నాడు. విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న రామగుండం ఎస్ఐ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.