KCR Song | కేసీఆర్ పాటలు పెట్టినందుకు భక్తులపై ఎస్ఐ దౌర్జన్యం.. వీడియో
KCR Song కేసీఆర్ పాట పెట్టినందుకు కావాలనే నన్ను ఎస్ఐ కొట్టిండంటూ వాపోయాడు. తమను లాఠీతో కొట్టి, కేసులు పెడతానని, తమ వాహనం సీజ్ చేస్తానని ఎస్ఐ నరేష్ బెదిరించాడని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
KCR Song | వినాయకుడి నిమజ్జనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యువత కేసీఆర్ పాటలు పెడుతూ జోష్‌లో శోభాయాత్ర చేపడుతున్నారని తెలిసిందే. ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ చెప్పారు. అయితే యువతకు నియయ నిబంధనల గురించి పద్దతిగా చెప్పాల్సిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీ ఝళిపిస్తున్నారు.
ట్యాంక్‌బండ్ శోభాయాత్రలో వెళ్తున్న ఓ వాహనంలో కేసీఆర్ పాట పెట్టినందుకు ఎస్ఐ భక్తులను లాఠీతో కొట్టాడు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన వాహనంలో కేసీఆర్ పాటలు పెట్టొద్దంటూ భక్తులపై ఎస్సై నరేష్ లాఠీతో విరుచుకుపడ్డాడు. ఎస్ఐ నరేష్ కేసీఆర్ పాటలు పెడితే కేసులు బుక్ చేస్తా అంటూ నిర్వాహకుడిని వాహనంపై నుంచి లాగి దౌర్జన్యం చేశాడు. నేను బండిలో కూర్చుని ఉన్నా.. ఉత్తగనే వచ్చి నాపై లాఠీ చార్జ్ చేసిండు.
కేసీఆర్ పాట పెట్టినందుకు కావాలనే నన్ను ఎస్ఐ కొట్టిండంటూ వాపోయాడు. తమను లాఠీతో కొట్టి, కేసులు పెడతానని, తమ వాహనం సీజ్ చేస్తానని ఎస్ఐ నరేష్ బెదిరించాడని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా రిపోర్టర్‌ను గల్లా పట్టుకొని వీడియోలు ఎందుకు తీస్తున్నావు అంటూ ఎస్ఐ నరేష్ దాడికి యత్నించడం వీడియోలో చూడొచ్చు.
కేసీఆర్ పాట పెట్టినందుకు భక్తులను లాఠీతో కొట్టిన ఎస్సై
ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన వాహనంలో కేసీఆర్ పాటలు పెట్టొద్దని భక్తులపై ఎస్సై నరేష్ లాఠీ ఝులుం
కేసీఆర్ పాటలు పెడితే కేసులు బుక్ చేస్తా అంటూ నిర్వాహకుడిని వాహనం పై నుంచి లాగిన ఎస్సై
తమను లాఠీతో… https://t.co/wUucZrNrCA pic.twitter.com/5r1hrFtNbw
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

