మంథని, ఫిబ్రవరి 19: తన సెల్ ఫోన్ హ్యాక్ (Cell phone hacked)అయిందంటూ ఓ యువకుడు సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన ఘటన మంథనిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి చిట్టవేన హరీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన హరీష్ ఉదయం పని నిమిత్తం మంథనికి వచ్చి వాట్సప్ ఓపెన్ చేయగా అది ఎంతకు ఓపెన్ కాలేదు. అంతలోపే తన కాంటాక్టు నెంబర్లలోని కొంత మంది నెంబర్స్ నుంచి ఆశ్లీల చిత్రాలు గ్రూప్‌లో పోస్టు అయ్యాయని తెలిపారు. తనకు తెలియకుండా తన వాట్సప్ గ్రూప్‌ల్లో ఆశ్లీల చిత్రాలు పోస్టు అవుతుండటంతో విస్మయానికి గురైన హరీష్ మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించడంతో 1930 నెంబర్ ద్వారా హరీష్ ఫిర్యాదు చేశారు. వెంటనే ఫోన్ రిస్టార్ట్ చేయడంతో పాటు పాత సిమ్‌ను బ్లాక్ చేసి అదే నెంబర్‌పై కొత్త సిమ్‌ను తీసుకున్నట్లు బాధితుడు హరీష్ తెలిపారు. తనకు ఎలాంటి సంబంధం లేకుండానే తన ఫోన్ నుంచి ఆశ్లీల చిత్రాలు గ్రూప్‌ల్లో పోస్టు అయ్యాయని నా ఫోన్లో డాటా ఏది కూడా తనకు కన్పించడం లేదన్నారు. ఆరెంద గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కూడా రెండు రోజుల క్రితం ఈ విధంగానే జరిగిందని ఆయన వివరించారు.