కళాశాలను సందర్శించిన బృందం సభ్యులు..
పెద్దపల్లి రూరల్, ఆగస్టు 11: పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం బెంగళూరుకు సంబంధించిన న్యాక్ బృందం సభ్యులు డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాల పరిసరాలు, పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ తెలిపారు. కళాశాల సందర్శనకు వచ్చిన న్యాక్ బృందానికి ఎన్సీసీ కేడెట్లు గౌరవ వందనంతో ఆహ్వానించారు. బెంగుళూరుకు చెందిన న్యాక్ బృందంలో గురుదీప్ సింగ్ బాట్రా, పురుషోత్తం నాయక్, రవీంద్రన్, రాఘవన్ తదితరులు కళాశాలను సందర్శించి అన్నిరకాల విభాగాలను ఆట స్థలాన్ని, కంప్యూటర్, క్యాంటీన్, హాస్టల్ సదుపాయాలను పరిశీలించా రు. న్యాక్ బృందానికి ఉన్నతవిద్య పక్షాన జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న మార్పులకు సంబంధించిన అంశాలను వివరించారు. పరిశీలన కార్యక్రమానికి సమన్వయకర్తగా కెప్టెన్ రేగళ్ల సంజీవ్ వ్యవహరించి అన్ని విభాగాల అంశాలను న్యాక్ బృందానికి వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాస్, డీ రవీందర్ రావు, ఎన్ మనోజ్, కే అర్జున్, ఆర్ రామకృష్ణ, రాధిక, అశోక్‌రెడ్డి, శరత్, భాను విజయానంద్, శ్రీనివాస్, సుమన్, సునీత, కిరణ్మయి, ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.