పెద్దపల్లి ఎమ్మెల్యేదాసరి మనోహరెడ్డి
నాలుగో విడుత పల్లె ప్రగతిపై సన్నాహక సమావేశాలు
పెద్దపల్లి రూరల్, జూన్ 30: పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకొని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగో విడుత పల్లెప్రగతి సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లి మం డల పరిషత్‌లో బుధవారం ఎంపీపీ బండారి స్రవంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. 4వ విడుతలో పూర్తి స్థాయిలో పనులు జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో ముందుకు సాగితేనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని వివరించారు. హరితహారంలో అనుకున్న లక్ష్యాలను అధిగమించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలన్నారు. అనంతరం జిల్లా సహకార అధికారి, మండల ప్రత్యేక అధికారి మైకేల్బోస్ మాట్లాడుతూ, సమావేశాలకు ప్రజాప్రతినిధులు సకాలంలో వస్తున్నారని, అధికారులు మాత్రం ఆలస్యంగా రావడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగం, ఎంపీడీవో ఎం రాజు, ఎంపీవో సుదర్శన్, ఎంఈవో సురేందర్‌కుమార్, ప్రత్యేకాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఎలిగేడు, జూన్ 30: ఎలిగేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి పల్లె ప్రగతి కార్యక్రమంపై ఎంపీపీ తానిపర్తి స్రవంతి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులకు సూచనలు, సలహాలు చేశా రు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి తిరుపతిరావు, ఎంపీడీవో శ్రీనివాసమూర్తి, ఎంపీవో అనిల్‌రెడ్డి, పీఆర్ ఏఈ జగదీశ్వర్, ఎలిగేడు సర్పంచ్ బూర్ల సింధూర, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాడ కొండాల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అభివృద్ధే ధ్యేయంగా..
కాల్వశ్రీరాంపూర్, జూన్30: పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిని సమష్టిగా విజయవంతం చేద్దామని మండల ప్రత్యేకాధికారి, డీఏవో తిరుమల్‌ప్రసాద్ పేర్కొన్నారు. పల్లెప్రగతిపై మండల స్థాయి అధికారులతో మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కిషన్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
ధర్మారం,జూన్30: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి సూచించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో ‘పల్లె ప్రగతి’ విజయవంతంపై సర్పంచులు, జీపీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో ఎంపీపీ ము త్యాల కరుణశ్రీ అధ్యక్షతన చేపట్టిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెలా పల్లె ప్రగతి పనులకు నిధులు కేటాయిస్తున్నదని తెలిపారు. పది రోజుల పాటు అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం పనులు చేపట్టి నివేదికలు సమర్పించాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీవో జయశీల, ఎంపీవో చిరంజీవి పాల్గొన్నారు.
సమస్యలు దూరం
పాలకుర్తి, జూన్30: పల్లె ప్రగతితో గ్రామాల్లో సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి పేర్కొన్నారు. మండలస్థాయి పల్లెప్రగతి సన్నాహక సమావేశం పాలకుర్తి రైతువేదిక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. గ్రామాల్లో సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారిని సీఎం కేసీఆర్ నియమించారని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, ఎంపీడీవో వెంకటచైతన్య, ఎంపీవో షబ్బీర్, ప్రత్యేకాధికారి వెంకటనారాయణ పాల్గొన్నారు.
రాజీవ్తండాలో పల్లెప్రగతి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రాథమిక పాఠశాలలో సమావేశం నిర్వహించారు. పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, పల్లెను అభివృద్ధి చేసుకోవాలని గ్రామసభలో తీర్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ బదావత్ రాజునాయక్, ప్రత్యేకాధికారి వెంకట్రాజం, ఉప సర్పంచ్ జ్యోతిశంకర్, వార్డు సభ్యుడు తిరుపతి, కార్యదర్శి ప్రసాద్, భూమయ్య పాల్గొన్నారు.
ఓదెల, జూన్ 30: మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జడ్పీ డిప్యూటీ సీఈవో గీత హాజరై మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీ రేణుకాదేవి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో వాజిద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోపరపల్లిలో సర్పంచ్ కర్క మల్లారెడ్డి, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, వార్డు సభ్యులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించారు.