పెద్దపల్లి : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రకాశ్‌రావు వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గోనె దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రకాశ్‌రావు తన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లాల కనకరాజ్, వెంకటేశం కాంతయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.