PEDDAPALLY MLA | ఓదెల, ఏప్రిల్ 12: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని రూపునారాయణపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో శివ పంచాయతన నవగ్రహ, ఆలయ 9వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చన హోమ బలిహరణ, నవగ్రహ పూజ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.