ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
‘కాంగ్రెస్‌కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
- యాభై ఏండ్లలో చేయనివారు ఇప్పుడేం చేస్తారు?
- ప్రజలు ఆలోచించి కారుగుర్తుకు ఓటేయాలి
- పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్ది
- గులాబీ పార్టీలో యువకుల చేరిక
పెద్దపల్లి, నవంబర్10: ‘కాంగ్రెస్‌కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చేయాలి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రెండు పర్యాయాలు నిండు మనుస్సుతో పెద్దపల్లి ప్రజలు ఆశీర్వదించారు. ఓదెలలోని శివాలయ యూత్ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో బీఆర్ఎస్లో చేరారు. వీరికి దాసరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్నింటా వెనుకబడిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో అప్పటి ఉద్యమనేత కేసీఆర్ చావునోట్లో తలబెట్టి రాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. పదేండ్ల కింద పెద్దపల్లి ఎలా ఉన్నది? ఇప్పుడేలా ఉన్నది? అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పెద్దపల్లిపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని, వేల కోట్లు ఇచ్చారని వెల్లడించారు.పెద్దపల్లి నుంచి మండలకేంద్రాలకు డబుల్రోడ్లు నిర్మించామన్నారు. గల్లీల్లో సీసీ రోడ్లు వేసుకున్నామన్నారు. మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పచ్చిమట్ల శ్రీనివాస్, మార రవి కుమార్, కనికిరెడ్డి సతీష్, తీర్తాల కుమారస్వామి, చింతం మోగిలి, బుద్దె కుమార్, బుద్దె రామస్వామి, బుద్దె పోచెట్టి, బోడకుంట మహేందర్, పడాల మల్లయ్య, గోపతి ఎల్లయ్య, రేగుల స్వామి, కొండ్ర సారయ్య, రామినేని లక్ష్మణ్ పాల్గొన్నారు.
చేరిందివీరే..
ఓదెల యూత్ నాయకులు మార చందు, గట్టు అరవింద్, భూసారపు రాకేష్, నాగపురి సిద్దూ, నాగపురి రాకేష్, కాసారపు రాజు, మార సాగర్, పోతుగంటి అజయ్, సూత్రాల నవీన్, తోట అనుదీప్, గుండేటి అజయ్, జీల ప్రవీణ్ కుమార్, మా చర్ల సాయి, మాచర్ల బన్నీ, పూదరి సిద్ధూ, ఆ శిష్, సాయి, బుడిగే సాయి, మండల షాలూం,సుల్తానా బాద్ మండలం భూపతిపూర్‌కు చెందిన కాంగ్రెస్ యూత్ లీడర్ కనకం శేఖర్ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పాల రామారావు, పార్టీ కన్వీనర్ లంక దాసరి రవి, నాయకులు పోచమల్లు, దేవ శ్రీనివాస్, స్వామి, పోచంపల్లి రాజు, తిరుపతి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

