Court orders | పెద్దపల్లి, జూలై 04(నమస్తే తెలంగాణ): సింగరేణి భూనిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను శుక్రవారం పెద్దపల్లి కోర్టు బేలిఫ్, బాధితుల తరపు న్యాయవాది డాక్టర్ మేకల మల్లేశం యాదవ్ ల్యాండ్ అక్విజేషన్ అధికారికి నోటీసులు అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. సింగరేణి ఆర్జీ-2 ఓసీపీ-3 విస్తరణలో భాగంగా 2004లో అప్పటి రామగుండం మండలం మారేడువాకలో దాదాపుగా 200ల ఎకరాల భూములను సేకరించింది.
అయితే.. సింగరేణి 2004లో మారెడువాక ఇండ్లను బొగ్గు ఉత్పత్తి కోసం తీసుకుంది. సరైన నష్టపరిహారం ఇవ్వలేదని, తమకు న్యాయం చేయాలని కేసు వేస్తే జడ్జ్ 100అనౌన్స్ మెంట్ చేస్తూ తీర్పు చెప్పారు. 100ఇస్తే మరో వంద శాతం ఇవ్వాలనేది జడ్జిమెంట్ సారాంశం. ఈ విషయంలో సింగరేణి సంస్థ నిర్వాసితులతో చర్చలు జరపగా కొంత మంది 85శాతం ఇస్తే సరిపోతుందని కొంత మంది క్లెమేట్స్ ఒప్పుకున్నారు. దీనిపై మరి కొంత మంది లేదు.. లేదు.. 100కు 100శాతం చెల్లించాల్సిందేనని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు 100శాతం ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. కానీ సింగరేణి సంస్థ అందుకు సిద్ధపడకపోవడం చెల్లింపులు చేయకపోవడంతో పెద్దపల్లి కోర్టులో ఈపీ నెం. 1/2023ద్వారా మాకు 18లక్షల పైచిలుకు పరిహారం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేసుకున్నారు.
ఆ పిటిషన్‌పై సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానం ఇక్కడి కలెక్టరేట్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ యొక్క కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు, అన్ని కూడా అటాచ్మెంట్స్ చేయమని చెప్పింది. నోటీసులు పంపినా డబ్బులు కట్టలేదు కాబట్టి ల్యాడ్ అక్విజేషన్ ఆఫీసర్ మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి వారి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్‌ను జప్తు చేయమని జూన్ 20న ఆర్డర్ ఇచ్చారు. దీంతో సదరు కోర్టు ఉత్తర్వులను కోర్టు బేలిఫ్తో పాటుగా.. బాధితుల తరపు న్యాయవాది డాక్టర్ మేకల మల్లేశం యాదవ్ శుక్రవారం ల్యాండ్ అక్విజేషన్ అధికారి సీతారాంనకు అందజేశారు. దీంతో ల్యాండ్ అక్విజేషన్ అధికారి సింగరేణి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మారేడువాక నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.18లక్షల పై చీలుకు పరిహారాన్ని వెంటనే అందజేయాలని కోరారు.
దీంతో 15రోజుల్లో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపడుతామని అప్పటి వరకు జప్తు చేయకుండా ఉండాలని కోరారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని అడ్వకేట్‌కు వారు హామీ ఇచ్చారు. ల్యాండ్ అక్విజేషన్ అధికారి హామీ మేరకు కోర్టు బేలిఫ్, బాధితుల తరపు న్యాయవాది మేకల మల్లేశంలు వెనుతిరిగారు. 15రోజుల్లో సింగరేణి యాజమాన్యం పరిహారం డబ్బులు చెల్లిస్తుందా.. ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయ ఫర్నీచర్, ఇతర సామగ్రిని జప్తు చేయిస్తుందా వేచి చూడాలి.