Ministers Sridhar Babu, Srinivas Reddy | పెద్దపల్లి, జూన్ 13( నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెద్దపల్లి వచ్చారు. కాగా వారికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టరేట్ హెలిపాడ్ వద్ద పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.