Korukanti Chander | కోల్ సిటీ, జూలై 6 : అమ్మా పెద్దమ్మ తల్లీ.. అబద్దపు హామీలు, వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడు తల్లి .. అంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వేడుకున్నారు. గోదావరిఖనిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో ఆదివారం ఆయన పాల్గొని పెద్దమ్మ తల్లికి పలు ప్రత్యేక పూజలు చేశారు.
రామగుండం నియోజక వర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా అమ్మ ఆశీస్సులు ఎల్లవేళా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చందర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.