పాస్‌బుక్స్ రావు.. ఇదేం భూ భారతి ?
భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్‌ను పక్కన పెట్టి రైతులను కష్టాల్లోకి నెట్టింది.
- రిజిస్ట్రేషన్లు జరిగి నెలలు గడుస్తున్నా పత్తాలేని పట్టాదారు పుస్తకాలు
- పెద్దపల్లి జిల్లాలో 31,522 మందికి పెండింగ్
- రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
- ఖాతా బుక్కుల్లేక బ్యాంకు లోన్లు, ప్రభుత్వ పథకాలకు దూరం
- పట్టించుకోని ప్రభుత్వం
పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్‌ను పక్కన పెట్టి రైతులను కష్టాల్లోకి నెట్టింది. కొనుగోలుదారులకు పది నెలలుగా పాసు బుక్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం పదిరోజుల్లోనే నేరుగా రైతు ఇంటికి పోస్టులో పాస్‌బుక్ వచ్చేది. కానీ, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి మారిపోయింది.
2025 ఏప్రిల్ 14న పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి, అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తున్నా పాసు పుస్తకాల జారీ మాత్రం నిలిచిపోయింది. వాస్తవానికి భూమికొన్న రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనే ధీమా.. భరోసా! పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి విలువైన పాస్ పుస్తకాలను జారీ నిలిచిపోవడం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూ భారతి ప్రారంభించిన ఈ పది నెలల కాలంలో పెద్దపల్లి జిల్లాలో 31,522 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అందులో ఏ ఒక్కరికీ పట్టాదారు పాసు పుస్తకం రాలేదు. ఈ విషయమై తహసీల్దార్ల దగ్గరికి వెళ్లి అడిగితే ఆ బాధ్యత తమది కాదని, పూర్తిగా ప్రభుత్వానిది, కాంట్రాక్ట్ ఏజెన్సీలదేనని, ‘పాస్ పుస్తకాలు మీ ఇంటికే వస్తాయి’ అని సెలవిస్తుండడంతో తిరిగీ తిరిగి వేసారుతున్నారు. రుణాలు తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే పాసు బుక్కులు లేకపోవడంతో బ్యాంకర్లు నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. ఓ వైపు పెట్టుబడి సాయం రైతు భరోసా ఇవ్వరని, మరోవైపు బ్యాంకుల్లో అప్పు పు ట్టక సేద్యం ఎలా చేసేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటుగా డబ్బులు వడ్డీలకు తెచ్చుకొని అప్పుల పాలవుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాసు పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మూడు నెలలు దాటినా రాకపాయె
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు వడ్లూరి రాజేశ్వరరావు. ఊరు కాల్వశ్రీరాంపూర్. ఆయన తండ్రి నంబారావు పేరుమీద ఉన్న భూమిని 2025 నవంబర్‌లో గిఫ్ట్ డీడ్ చేయించుకున్నడు. కానీ ఇంత వరకు ఆయనకు పట్టాదారు పాసుబుకు రాలేదు. మూడు నెలలుగా తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నడు. అయినా రాలేదు. భూమిపై రుణం కోసం బ్యాంకుకు వెళ్తే పాస్‌బుక్ లేకపోతే ఇవ్వలేమని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పట్టా చేసుకున్న 15 రోజుల్లోపే ఇంటికే పాసుబుక్ వచ్చేదని, ఇప్పుడెందుకు రావడం లేదని వాపోతున్నడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

