Best Available school | పెద్దపల్లి టౌన్ అక్టోబర్ 8 : రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థలలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తల్లిదండ్రులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు చేయడంతో పాటు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులు నినాదాలు చేశారు. సీపీఎం, ఏఐఎస్ఎఫ్, కేవీపీఎస్ నాయకులు సిపెల్లి రవీందర్, కల్లేపల్లి అశోక్, బాలసాని లెనిన్, మోదంపల్లి శ్రావణి, కన్నూరి శ్రీశైలం తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.