కమాన్చౌరస్తా, మే 13 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో పారమిత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో పది, 12వ తరగతి పీసీఎం, పీసీబీ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఈ ప్రసాదరావు తెలిపారు.
పది ఫలితాల్లో మన్హా మెహ్వష్ 97.47 అగ్రగామిగా నిలువగా, లక్ష్మి హాసిని 95.6 శాతం, నందన్ ప్రణవ్ 95.2 శాతం, స్ఫూర్తి 95 శాతం, ఆశిష్ 94.6 తర్వాతి స్థానాల్లో నిలిచారు. 46 శాతం విద్యార్థులు 80 శాతం కంటే ఎకువ మారులు సాధించినట్లు చెప్పారు. కాగా, 12వ తరగతి ఎంపీసీలో గట్టు మనస్విని 94 శాతం, నిర్మల కృష్ణ తేజ 91 శాతం, దేశీని సహర్ష్ 90 శాతం సాధించారు. బైపీసీలో బొమ్మడి శివ 95 శాతం, అయాన్ 91 శాతం, బీఈఏలో శ్రేష్ట 82 శాతం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ ప్రసాద రావు అభినందించారు. ఇక్కడ ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు.