స్వరాష్ట్రంలో పల్లెల ప్రగతి
పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన గొల్లపల్లి, కల్వల గ్రామాల్లో రేషన్ దుకాణాలను ప్రారంభించారు. అనంతరం కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, ఆముదాలపల్లి, కాచాపూర్, కల్వల, రాజాపూర్, మొలంగూర్, కేశవపట్నం గ్రామాలను సందర్శించారు
- మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- గొల్లపల్లి, కల్వల గ్రామాల్లో రేషన్ షాపులు ప్రారంభం
- లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
శంకరపట్నం, ఆగస్టు 4: పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన గొల్లపల్లి, కల్వల గ్రామాల్లో రేషన్ దుకాణాలను ప్రారంభించారు. అనంతరం కొత్తగట్టు, లింగాపూర్, మెట్పల్లి, ఆముదాలపల్లి, కాచాపూర్, కల్వల, రాజాపూర్, మొలంగూర్, కేశవపట్నం గ్రామాలను సందర్శించారు. పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పంచాయతీల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
శిథిలావస్థకు చేరిన కల్వల ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిని వెంటనే తొలగించాలని ఎంపీఓను ఆదేశించారు. నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సర్కారు సన్నద్ధమైందన్నారు. నయాపైసా ఖర్చులేకుండా దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని దళితులకు సూచించారు. ఈ సందర్భంగా సమస్యలను అడిగితెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొలంగూర్‌లో వెంకటయ్య మృతి చెందగా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పిం చారు. కేశవపట్నంలో అల్లెంకి తిరుపతయ్య కోడలు స్వప్న మృతి చెందగా, తిరుపతయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీవో బషీరొద్దీన్, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచులు ఉడిగె రజిత, దాసారపు భద్రయ్య, మొకిరాల కిషన్‌రావు, అంతం వీరారెడ్డి, వంగల సరోజన, బత్తుల మానస, కోండ్ర రాజయ్య, పిన్‌రెడ్డి వసంత, మోరె అనూష, ఎంపీటీసీలు మాతంగి లక్ష్మి, మొయిన్, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ కవిత, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, కొత్తగట్టు ఆలయ చైర్మన్ శ్యాంరావు, విండో చైర్మన్ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

