హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్ 9: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అందజేశారు.
కాగా, తన రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి ఆమోదించినట్లు తెలిపారు. తను శాసనసభ సభ్యుడిగా చివరి శ్వాస వరకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు.