Vemulawada | వేములవాడ, ఆగస్టు 24 : రూ.ఏడు కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్ నిర్వాహకులను సోమవారం వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021-22 సంవత్సరం నుండి 2024-25 వరకు రబీ, ఖరీఫ్ లకు సంబంధించిన 8,447.138 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కోనాయపల్లి పరిధిలోని ఆంజనేయ ట్రేడర్స్ కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లుకు కస్టమ్స్ మిల్లింగ్ కింద కేటాయించారని తెలిపారు. అయితే 8,447.138 మెట్రిక్ టన్నులు కేటాయించిన ధాన్యాన్ని కస్టమ్స్ మిల్లింగ్ చేసి 5,659. 582 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాలకు శాఖకు ఇవ్వాల్సి ఉందన్నారు. సదరు రైస్ మిల్ నిర్వాహకులు ఇందులో 3167. 605 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇవ్వగా, 2491.977 మెట్రిక్ టన్నులు డిఫాల్ట్ ర్ గా తేలారని చెప్పారు.
దీంతో అధికారులు 25 శాతం ఫైన్ విధించగా 3114. 972 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఇక ఇందులోను 879. 131 మెట్రి టన్నులు మాత్రమే సంబంధిత పౌరసరఫరాలకు అందజేసి డిఫాల్టర్ గా నిలిచారని తెలిపారు. పెనాల్టీతో సహా 2235. 841 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా సుమారు రూ.7కోట్ల 55 లక్షల, 71వేల 668 విలువైన ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ ఖజానాకు నష్టంనే కలిగించారని జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇందులో రైస్ మిల్ నిర్వాహకులు చేపూరి అంజయ్య, ఆచం సంతోష్, దొంతుల గణేష్, చేపూరి మధుకర్, లోపల్లి వెంకటేశ్వర్ రావులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని మోసగించినందున ఇందులో చేపూరి అంజయ్య, లోపల్లి వెంకటేశ్వర్ రావులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించగా మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఎస్సై ప్రేమానంద్ తదితరులు ఉన్నారు.