తీగలగుట్టపల్లిలో బస్తీ, పల్లె దవాఖానలను ప్రారంభించిన అనంతరం పరీక్షలు చేయించు కుంటున్న మంత్రి గంగుల కమలాకర్, చిత్రంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావు తదితరులు
విద్యానగర్, మే 5: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని రా ష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రామీణ నిరుపేదలకు మెరుగైన వైద్యమందించేందుకు కేసీఆర్ సర్కారు బస్తీ, పల్లె దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి గ్రామం ఒకటో డివిజన్లో బస్తీ, పల్లె ద వాఖానలు, కరీంనగర్ జిల్లా దవాఖానలో మా నసిక ఆరోగ్య చికిత్సా కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని చెప్పారు. బస్తీ దవాఖానల్లో శనివారం మినహా వారంలో అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు వైద్యసేవలం దిస్తారని పేర్కొన్నారు.
ఈ దిశగా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానల్లో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మౌలిక వసతులు కల్పించిందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్స్, న్యూట్రీషన్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి లాంటి స్కీంలకు అంకురార్పణ చేసిందని చెప్పారు. జిల్లాకేంద్రాల్లో డ యాగ్నొసిస్ సెంటర్లను నెలకొల్పి 57 రకాల ప రీక్షలను ఉచితంగా చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు దేవుడి తర్వాత మొక్కేది వైద్యులకేనని, అంతటి గొప్ప స్థానంలో ఉన్నవారు పేదలకు నమ్మకం కల్పించేలా సేవలందించాలని సూ చించారు. మానసిక వైద్య వృత్తి ఎంతో గొప్పదని, మనిషి తనపై తాను నియంత్రణను కో ల్పోయి మానసిక రోగులుగా తయారవుతున్న క్రమంలో వారిని కాపాడే ఏకైక వ్యక్తి మానసిక వైద్యుడేనని అన్నారు. కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, వైద్యా ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, మున్సిపల్ కమిషనర్ సేవాఇస్లావత్, దవాఖాన సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్, ఆర్ఎంవో డా క్టర్ జ్యోతి, అదనపు ఆర్ఎంవో డాక్టర్ నవీన, డాక్టర్ అలిమొద్దీన్ తదితరులు ఉన్నారు.