కరీంనగర్ కమాన్చౌరస్తా, జూలై 5 : చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఒక వరంగా మారింది. ఇందులో పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ సైతం చేసే అవకాశం ఉండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో 2025-26 సంవత్సరానికి ఓపెన్ సూ ల్ పదో తరగతి, ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్లు ప్రా రంభమయ్యాయి. అయితే, ఇంటర్ చేయాలనుకుంటున్న వారు తప్పకుండా పదో తరగతి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో పదో తరగతి చదవాలంటే కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు
ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ చదువాలనుకునే వారు తమ దగ్గర్లోని టీజీ ఆన్లైన్ లే దా, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయంలోనే ఆన్లైన్లో తాము చదువుకోవాలనుకునే పరీక్ష కేంద్రాన్ని సైతం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫారం ఐప్లె చేసుకున్న పాఠశాలలో అందజేయాలి. ప్ర వేశాలకు జూలై 11వ తేదీ ఆఖరు కాగా, అపరాద రుసుంతో ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలవుల్లో తరగతులు
ఓపెన్ స్కూల్ ద్వారా చదవాలనుకునే వారికి కేవలం సెలవుల్లో మాత్రమే తరగతులు జరుగుతాయి. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లోనూ పాఠాలు చెప్తారు. ఇందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు సైతం కేంద్రాల్లోనే అందజేస్తారు. పదో తరగతి పూర్తి చేసుకున్న వారికి, ఇంటర్లో ప్రవేశాలు సైతం కల్పిస్తారు. ఇందులో ప్రవేశాలకు పదో తరగతి విద్యార్థులు రూ.1150, రూ.1500 ఫీజు చెల్లించాలి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు
పదో తరగతి : కరీంనగర్ 23, జగిత్యాల 9, పెద్దపల్లి 10, రాజన్న సిరిసిల్ల 11 మొత్తం 53
ఇంటర్(నాన్ సైన్స్) : కరీంనగర్ 26, జగిత్యాల 11, పెద్దపల్లి 11, రాజన్న సిరిసిల్ల 12 మొత్తం 60
ఇంటర్ (సైన్స్) : కరీంనగర్ 3, జగిత్యాల 2, పెద్దపల్లి 2, రాజన్న సిరిసిల్ల 1 మొత్తం
సద్వినియోగం చేసుకోవాలి
ఓపెన్ స్కూల్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 121 పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇందులో పదో తరగతి, ఇంటర్ చదివిన విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఉంది. చదువు మధ్యలో ఆపిన, చదవాలని ఉన్న వారికి ఇదొక మంచి అవకాశం.
– సల్వాజీ నాగేశ్వర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్