Peddapally | పెద్దపల్లి, డిసెంబర్ 8 : పంచాయతీ ఎన్నికల్లో గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసే నాయకుడినే ఎన్నుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎజ్జ రాజయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11, 14, 17 న జరగబోయే పంచాయతీ ఎన్నిల్లో మద్యం, మాంసం, డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి కోసం ఆలోచన చేసే అభ్యర్థికి ఓటు వేయాలన్నారు.
ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ తన తప్పని సరిగా వినియోగించుకోలన్నారు. ఓటు ఐదేండ్ల అభివృద్ధికి దిక్సూచి అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి అడప బాపురెడ్డి, రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇంజం సాంబశివరావు, జిల్లా సలహాదారు రాజేషం, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీదేవి, నాయకులు నూనేటి రామకృష్ణ, చిలుక రాజేషం, గొడిశేల నంబయ్య, అరుకాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.