ధర్మారం, జూన్1 : ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నది. కానీ, కాంగ్రెస్, బీజేపీల కండ్లుమండుతున్నయ్. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అసత్యప్రచారం చేస్తున్నయ్. ఇది చాలా సిగ్గుచేటు.’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. గురువారం ధ ర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో మంత్రి పర్యటించారు. 20 లక్షలతో నూతన జీపీ భవనం, జొన్నల రాశి గుట్ట వద్ద 5 లక్షలతో మాల సామాజిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలతో సీఎం కేసీఆర్ ముద్ర దేశవ్యాప్తమైందని చెప్పారు. సాగునీటి బాధలు తీర్చేందుకు నిర్మించిన ప్రాజెక్టులతో పొలాలకు పుష్కంగా నీరంది పుష్కలంగా పంటలు పండాయని, నేడు ఏ ఊళ్లో చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని చెప్పా రు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో విపక్ష పార్టీల నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు.
బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏం మాట్లాడతాడో ఆయనకే తెలువదని, ఆయన ఆరోపణలు అర్థరహితమని ఎద్దేవా చేశారు. బీసీ డిక్లరేషన్ చేస్తామని అంటున్న సంజయ్ దేశవాప్తంగా అ మలు చేస్తామని పీఎం నరేంద్ర మోడీతో ప్రకటన చేయించాలని సవాల్ విసిరారు. మోదీ అరాచక పాలనకు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎదుగుతున్నదని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో విస్తరిస్తుందని వెల్లడించారు. ఇక్కడ జడ్పీటీసీ పూ స్కూ రు పద్మజ -జితేందర్‌రావు, సర్పంచ్ గాగిరెడ్డి ప్రేమలత- తిరుపతి రెడ్డి, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు ఎగ్గెల స్వామి, పార్టీ మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్‌రెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ పూ స్కూరు నర్సింగారావు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ హఫీజ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింగం, ఉప సర్పంచ్ బత్తిని తిరుపతి పాల్గొన్నారు.