Electricity Employees | విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కంచాలనే డిమాండ్తో కొనసాగుతున్న నిరసన
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13వ రోజైన గురువారం తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల నిరసన కొనసాగింది.
Electricity Employees | ముకరంపుర, జులై 23 : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 13వ రోజైన గురువారం తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల నిరసన కొనసాగింది. నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ 30 రోజులుగా వ్యతిరేకిస్తున్నా శుక్రవారం వైటీపీఎస్ టెండర్లను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మేనేజ్ మెంట్ మొండిగా వ్యవహరిస్తే నిరసనను ఉధృతం చేస్తామన్నారు.
ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేనేజ్ మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న అన్ని క్యాడర్లలోని పోస్టులను భర్తీ చేయాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, యుగంధర్, సంతోష్, రంగు వెంకటనారాయణ, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

