Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక ర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడిని తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వీణవంకకు చెందిన తూర్పట్టి రమేశ్గా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.