Kodurupaka | సుల్తానాబాద్ రూరల్, జులై 9 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని వాగోడ్డుపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. గ్రామానికి చెందిన దేవవారనేని రాజేశ్వర్ రావు వ్యవసాయ భూమి లో గురువారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా తన 20 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ ఇనిస్టీట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసర్చ్ (iiopr ) ఆంధ్రప్రదేశ్ లోని పెద్దవేగి ఏలూరు నుండి ఆ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంచంద్రుడు హాజరై రైతులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ ఒక దీర్ఘకలికా పంట అని నాటిన మొదటి మూడో సంవత్సరాలనుండి పంట చేతికి వస్తుందని పేర్కొన్నారు. సరైన నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటించానేట్లయితే రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ దేవరానేని మోహన్ రావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, తిరుమల ఆయిల్ పామ్ సీఈఓ కేషు కల్యాంకర్, ప్రజాప్రతినిధులు, ఉద్యాన అధికారులు సుంకే మహేష్, ఉద్యాన విస్తరణ అధికారులు మహేష్, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్, రైతులు రాజేశ్వర్ రావు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.