Peddapally | పెద్దపల్లి, జూలై 19: జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై సూచనలు చేశారు. ఆయిల్ పామ్ సాగుతో వచ్చే ఆదాయంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి కేటాయించిన టార్గెట్ను సకాలంలో పూర్తి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, డీఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.