Mahanandi Award | ధర్మారం, సెప్టెంబర్ 14: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు మక్కపెల్లి రాజమల్లు యాదవ్ మహానంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజమల్లు ప్రస్తుతం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మల్లికార్జునస్వామి ఒగ్గు పూజారి. తెలంగాణ శ్రీ మల్లికార్జున స్వామి యాదవ్ ఒగ్గు పూజారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి గా వ్యవహరిస్తున్నారు.
రాజమల్లు ఒగ్గు పట్నాలు వేయటం, సామాజిక సేవ కార్యక్రమాల కింద కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తన పాటల ద్వారా అవగాహన కలిగిస్తున్నాడు. పాటలు, కథల రూపంలో 35 సంవత్సరలపాటు కళారంగంలో ఒగ్గుకథలు సంవత్సరాల పాటు కలిగి ఉన్న అనుభవాన్ని గుర్తించి అతనిని పురస్కారానికి ఎంపిక చేశారు.
సిద్దిపేట జిల్లాలోనీ హుస్నాబాద్ లోని రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్ ఆదివారం జరిగిన సాహితి సాంస్కృతిక, సామాజిక సేవ సంస్థ ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ వారు మహానంది జాతీయ అవార్డు ను ముఖ్య అతిథి బ్రహ్మ అప్పినపెల్లి భాస్కర చారి, పోలోజు రాజుకుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. అతనిని పురస్కారంతో సత్కరించి శాలువా కప్పి అవార్డుతో ఘనంగా సన్మానించారు.
ఈ అవార్డు రావడం పట్ల రాజమల్లు యాదవ్ మాట్లాడుతూ నా కళను గుర్తించి అవార్డు ఇచ్చిన సంస్థ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కళారంగంలో మరింత బాధ్యత పెరిగిందని అని అన్నారు.