Collector Koya Sriharsha | ప్రభుత్వ సేవల నాణ్యత పెంపే లక్ష్యంగా అధికారులు పని చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
- ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- ఆసుపత్రి పనితీరు మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలి
Collector Koya Sriharsha | కమాన్‌పూర్, జూలై 21 : ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్‌పూర్, రామగిరి మండలాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియ, పెంచికల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములు, రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గుండారం ఎంపీపీఎస్. పాఠశాలలో ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించాలని, ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు పూర్తిస్థాయిలో అలవడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ బోధన, విద్యార్థుల హాజరు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. కమాన్‌పూర్ మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం, మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి కొత్త భవనం నుంచే తహసీల్దార్ కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతీ దశను కచ్చితత్వంతో అమలు చేయాలని ఆదేశించారు. పెంచికల్పేట్ గ్రామంలోని సింగరేణి భూములను పరిశీలించిన కలెక్టర్, భూ వివాదాల పరిష్కారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ (ల్యాండ్ సర్వే)ఆధ్వర్యంలో సమగ్ర భూ సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లేబర్ రూమ్, వ్యాక్సినేషన్ విభాగాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పనితీరును మెరుగుపరచడంతో పాటు ఓపీ సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ఆరోగ్య సూచికలను నిర్దేశిత ప్రమాణాల మేరకు అమలు చేయాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్టాప్ డయేరియా కార్యక్రమం ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్)కార్యక్రమాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో కమాన్ పూర్ తహసీల్దార్ వాసంతి, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు వరలక్ష్మి, జగదీశ్, రామగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

