Chigurumamidi | చిగురుమామిడి, జులై 25 : చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు. వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ఆర్ఎల్ ప్రాజెక్టు, ఎఫ్టిఎల్ పూడికతీత పనులు చేపట్టారని ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మోయ తుమ్మెద వాగులోని ఇసుక తవ్వకాలపై గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి తో పోటు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని ఎవరు గ్రామం నుండి ఎవరు ఫిర్యాదు చేయలేదని వారు అధికారులకు సూచించారు.
ఎవరైనా రామంచ శివారులోని మోయతు మీద వాగులో ఇసుక తవ్వకాలు చేపట్టినట్లయితే అడ్డుకుంటామని సర్పంచ్ అధికారులకు తెలిపారు.వీరి వెంట ఇరిగేషన్ ఈఈ, మైనింగ్ ఏడి వెంకట్ రెడ్డి తో పాటు చిగురుమామిడి, సైదాపూర్ తాసిల్దార్లు కొడం కనకయ్య, శ్రీనివాస్ గౌడ్, ఎస్సై జగదీశ్వర్, సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ గీట్ల తిరుపతిరెడ్డి, వార్డు సభ్యులు రాచకొండ సంపత్, దాసరి రవి, చెరుకు ఆంజనేయులు, రైతులు ఉన్నారు.