మూడు గ్రామాల పరిధిలో 48 మంది రైతులకు 52 లక్షల రూపాయల నగదు రావాల్సి ఉండగా అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కు రైతులు వెళ్లి మొరపెట్టుకుంటే డీసీఎంకు దగ్గరకు వెళ్లాలని సూచిస్తుండగా మా చేతిలో ఏమీ లేదని వారు తిప్పి పంపుతున్నారని అన్నారు. అయితే సాక్షాత్తు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా అధికారులకు ఫోన్ చేసిన రేపు మాపు అంటూ రైతులను తిప్పుతూ పని చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఒకవైపు ఎలినో తో పంటలు పండే పరిస్థితి లేక కొట్టుమిట్టాడుతుండగా కనీసం విక్రయించిన ధాన్యం పైసలు కూడా అధికారులు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం కుంభకోణంలోని నిందితుడు మధుకర్ మాత్రం దర్జాగా ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారని, వెంటనే ఆయన అక్కడికి వచ్చి తమకు డబ్బులు ఇవ్వాలని వారు భవనంపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ శ్రీనివాస్ రెండు చేతులు జోడించి దయచేసి రైతుల డబ్బులు ఇప్పించాలని ఆయన వేడుకున్నారు. మధుకర్ ఇంటి వద్ద వద్దకు రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.