Odela | ఓదెల, ఆగస్టు 31 : యాదవుల సంక్షేమానికి పాటు పడతామని యాదవ మహాసభ ఓదెల మండల అధ్యక్షుడు వేల్పుల ఐలయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో నూతనంగా ఎన్నికైన యాదవ మహాసభ పాలకవర్గం సోమవారం మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు వేల్పుల ఐలయ్య యాదవ్ మాట్లాడారు. ఓదెల మండలంలోని యాదవులను సంఘటితపరిచి హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాడనున్నట్లు పేర్కొన్నారు.
యాదవుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను యాదవులకు అందేటట్లు తమ పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ గ్రామాన యాదవ కమిటీలను ఏర్పాటు చేసి యాదవుల ఐక్యతను చాటి చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మాజీ అధ్యక్షుడు కాబట్టి రాజు యాదవ్, గోపరపల్లె సర్పంచ్ మద్దేవేని రవి యాదవ్, నాయకులు కాశవేని నరేష్, మేకల సమ్మయ్య, పొలం మల్లయ్య, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.