Odela Mallanna Temple | ఓదెల, సెప్టెంబర్ 7 : పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు సంప్రోక్షణ తర్వాత దేవాలయాన్ని తిరిగి తెరవబడుతుందని అర్చకులు, ఆలయ ఈవో సదయ్య తెలిపారు.
ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. మల్లన్న ఆలయానికి భక్తులు జాతర సందర్భంగా ఆదివారం రావాల్సి ఉండగా, సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆలయం, పరిసర ప్రాంతాలు భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది.