Science Safari | చిగురుమామిడి, నవంబర్ 28: ఇండియా మెగా సైన్స్ ఫెస్టివల్ డిసెంబర్ 6 నుండి 9వ తేదీలలో నిర్వహించే 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఎంపిక కావడం పట్ల డిఇఓ మొండయ్య, సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, భగవంతయ్య, అశోక్ రెడ్డి, శ్రీనివాచిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కు ఆరవ సారి ఎంపికయ్యారు. స్ ఎంఈఓ పావని అభినందనలు తెలిపారు.
కాగా రేకొండ గ్రామానికి చెందిన ఓదెలు కుమార్ సైన్స్ సఫారీ కి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు చాడ రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పీరల్ల వెంకటరమణ, రామకృష్ణ, శ్రీనివాస్, హర్షం వ్యక్తం చేశారు.