OBC Mahasabha | సుల్తానాబాద్ రూరల్ జూలై 25: మండలంలోని గర్రెపల్లి పెద్ద బస్టాండ్ చౌరస్తా వద్ద శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్న రమేష్ ఆధ్వర్యంలో జాతీయ ఓబీసీ మహాసభ గోడ పోస్టను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్న రమేష్ మాట్లాడుతూ అఖిల భారతీయ జాతీయ ఓబీసీ మహాసభ ఆగస్టు 7న గోవాలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో గోవా యూనివర్సిటీ దగ్గర ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
కావున ఈ సభకు ఓబీసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్, మాజీ సర్పంచ్ అసరి రాజయ్య, మండల బీసీ సంఘం అధ్యక్షుడు కుందేళ్ళ శ్రీనివాస్, జెట్టి దినేష్, మాదాసు శ్రీనివాస్, పొట్ల కుమార్, సంకరి సంపత్, పడాల శ్రీనివాస్, సూరంపల్లి సంపత్, కుందేళ్ళ కనకయ్య, జెట్టి మల్లయ్య, పడాల తిరుపతి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.