Anganwadi Center | పెగడపల్లి: పెగడపల్లి మండలం లింగాపూర్ అనుబంధ గ్రామమైన ఉప్పుపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం వేడుక నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మండల ఐసీడీఎస్ సూపర్వైజర్ మహేశ్వరి మాట్లాడుతూ, మూడు నుండి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు చేపట్టాగా, ఇందులో అంగన్వాడీ టీచర్ సుహాసిని, ఆశాలు, తల్లులు పాల్గొన్నారు.