MacDrill | జ్యోతినగర్, మే 8: పహల్గాంకు ప్రతీకారంతో పాకిస్తాన్ ఉగ్రవాదంను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోసరిహద్దుల్లో భారతదేశంకు, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్య రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో భద్రత వ్యవస్థ బలోపేతం జరుగుతుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) ఎన్టీపీసీ సీనియర్ కమాడెంట్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో భద్రత చర్యలను రెండింతలతో కట్టుదిట్ట చేశారు.
ఆదనపు ఆయుధాలతో పెద్ద ఎత్తున మోహరించారు. డ్రోన్ దాడులను ఎదర్కొవడం, విపత్తులకు ప్రతిస్పందించడం వంటి చర్యలకు సిద్ధంగా కేంద్ర పోలీసు దళం మారోపక్క మాకు డ్రిల్‌ను నిర్వహిస్తున్నది. ప్లాంటులోని అన్ని గేట్లు, ఎగ్జిట్ పాయింట్లను పర్యవేక్షణతో క్లుప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 24గంటల పాటు నిఘాతో ఈ ప్రాంతంలో వాహన గస్తీ, కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో నిరంతర కమ్యూనికేషన్, సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు.