NTPC | జ్యోతినగర్, మే 12: రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ విజేందర్ యాదాద్రి విద్యుత్ కేంద్రంకు బదిలీతో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 రాష్ట్ర, రీజినల్ నాయకులు ఎస్ఈని సోమవారం ఘనంగా సన్మానించి విడ్కోలు పలికారు. ఎస్ఈ ఇక్కడి నుంచి రిలీవ్తో సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విడ్కోలలో ఎస్ఈకి పుష్పాగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేటీపీఎస్ నుంచి 15ఎళ్ల క్రితం ఏడీఈగా రామగుండం బీ థర్మల్ విద్యుత్ స్టేషన్ కు విచ్చేసిన విజేందర్ అంచెలంచెలుగా డీఈగా, సూపరింటెండింగ్ పదోన్నతితో ప్లాంటులో చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో 1535 యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుర్రం కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అబ్దుల్ తఖీ, నాయకులు అబ్దుల్ నజ్మీ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.