Nominations | వీణవంక, అక్టోబర్ 8 : వీణవంక మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాల నామినేషన్లు గురువారం నుండి స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ మెరుగు శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు.మొదటి అంతస్తులో ఎంపీటీసీలకు సంబంధించి నాలుగు క్లస్టర్లలో 14 ఎంపీటీసీ స్థానాలకు, గ్రౌండ్ ఫ్లోర్లో జడ్పీటీసీలకు సంబంధించి ఆర్డి నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. ఔత్సాహికులు ఎవరయితే ఉన్నారో వారి ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించుకొని అవసరమైన ధృవీకరణ పత్రాలు జతపరిచి కార్యాలయంలో ఆర్లకు అందజేయాలని అన్నారు.
ఈ నెల 12న నామినేషన్ల పరిశీలన, సాయంత్రం చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా, 13న అప్పీళ్ళు, 14న అప్పీళ్ళ పరిష్కారం, 15న ఉపసంహరణ, మధ్యాహ్నం 3 గంటలకు పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ, 23న పోలింగ్, వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.