రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి తెరపడింది. ఈ నెల 12న మొదలైన ప్రక్రియ, గురువారంతో ముగిసింది. చివరి రోజు జాతర సాగింది. ఆయాచోట్ల అభ్యర్థులు అట్టహాసంగా దరఖాస్తులు దాఖలు చేయగా, తరలివచ్చి న అభిమానులు, కార్యకర్తలతో సందడి కనిపించింది. ఈ ఒక్కరోజే 72 మంది 110 సెట్లు వేయ గా, మొత్తంగా మూడు రోజుల్లో 179 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
ఒకే సారి దాఖలు చేసిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు
అధికార బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులం తా ఒకే రోజు ఎన్నికల అధికారికి తమ నామినేష న్లు సమర్పించారు. 15 స్థానాలకుగాను 15 మం ది అభ్యర్థులలో పాటు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులంతా భారీ ఊరేగింపుగా ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. డప్పు చప్పు ళ్లు, బైక్ ర్యాలీలతో నామినేషన్ల జాతర సాగింది. మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, న్యాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, తెలంగాణ టెక్స్టైల్స్ పవర్ లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థులంతా కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్లు వేశారు.
తంగళ్లపల్లి చిక్కాల రామారావు, సిరిసిల్ల -1 దిడ్డి రమాదేవి, సిరిసిల్ల- 2 దార్నం లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డిపేట వర్స కృష్ణహరి, గంభీరావుపేట గౌరినేని నారాయణరావు, ముస్తాబాద్ చందుపట్ల అంజిరెడ్డి, వీర్నపల్లి మాడుగుల మల్లేశం, ఇల్లంతకుంట మల్లుగారి రవీందర్రెడ్డి, వేములవాడ-1 నామాల ఉమ, వేములవాడ అర్బన్ రేగులపాటి హరిచరణ్రావు, వేములవాడ రూరల్ ఆకుల దేవరాజు, చందుర్తి పొన్నాల శ్రీనివాసరావు, రుద్రంగి ఆకుల గంగారాం, కోనరావుపేట దేవరకొండ తిరుపతి, బోయినపల్లి కోటపల్లి సుధాకర్ నామినేషన్లు వేశా రు. కాగా, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీలతో పాటు స్వ తంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
130 మంది.. 179 సెట్లు
జిల్లా వ్యాప్తంగా 15 స్థానాలకుగాను మూడు రోజుల్లో 130 మంది అభ్యర్థులు 179 సెట్లు వేసినట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. తొలిరోజు 13, రెండో రోజు 56, మూడో రోజు 110 నామినేషన్లు వచ్చాయి. అందులో సిరిసిల్ల టౌన్-1లో 16, సిరిసిల్ల టౌన్ -2లో 8, తంగళ్లపల్లి 13, ఇల్లంతకుంట 6, గంభీరావుపేట 5, ముస్తాబాద్ 7, ఎల్లారెడ్డిపేట 8, వీర్నపల్లి 6, చందుర్తి 11, రుద్రంగి 5, కోనరావుపేట 3, వేములవాడ టౌన్ -18, వేములవాడ టౌన్-25, వేములవాడ రూరల్ 3, బోయినిపల్లి 6 చొప్పున సెట్లు దాఖలయ్యాయి. కాగా, నేడు నామినేషన్ల పరిశీలన, రేపు ఉపసంహరణ ఉంటుంది. ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.