Dumping Yard | కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్యర్యంలో నిరసన దీక్షా శిబిరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా డంపింగ్ యార్డ్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మా హుజూరాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డు వస్తే మాకు రోగాలు వస్తాయి, పంటలు పండవని స్థానిక వ్యక్తి ఒకరు అన్నారు. ఈ విషయమై సదరు వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే మా ఊరికి పిల్లను ఎవరు ఇవ్వరు, మా పిల్లను పెళ్లి కూడా చేసుకోరు.. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ వాసన వడి పిల్లలు అయ్యే అవకాశాలుండయ్ అన్నారు.
మాది విత్తనాలు తయారు చేసే ప్రాంతం.. డంపింగ్ యార్డ్ వస్తే విత్తనాలకు నోచుకోకుండా అవుతుంది. జనావాసాలు లేని పరకాల, భూపాలపల్లి, ములుగు, మేడారం ఏరియాలకు 40-50 కిలోమీటర్ల దూరంలో జంగిల్ ఉన్నది. దగ్గర పెట్టుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేం పండిస్తే సిర్సపల్లి గ్రామం నుంచి ప్రతీ ఒక విత్తనం ఆంధ్రాకు పోతది. మేం పండించిన పంటనే సీడ్ అయి వస్తది. డంపింగ్ యార్డ్ రద్దు చేయపోతే ఢిల్లీ వరకైనా పోయి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నువ్వు చెప్పేదాకా నాకు కూడా తెల్వదన్నాడు..
హుజూరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టడం వల్ల చుట్టు పక్కన ఉన్న 20 గ్రామాలు ఆగం అవుతాయని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, కలెక్టర్ ఇట్ల అందరికీ వినతి పత్రం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అయితే నువ్వు చెప్పేదాకా నాకు కూడా తెల్వదు అన్నాడు. మా ప్రజల గోస విని డంపింగ్ యార్డు పెట్టడం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
మా హుజూరాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డు వస్తే మాకు రోగాలు వస్తాయి, పంటలు పండవు
మా ఊరికి పిల్లను ఎవరు ఇవ్వరు, మా పిల్లను పెళ్లి కూడా చేసుకోరు
మాది విత్తనాలు తయారు చేసే ప్రాంతం.. డంపింగ్ యార్డ్ వస్తే విత్తనాలకు నోచుకోకుండా అవుతుంది
జనావాసాలు లేని దగ్గర పెట్టుకోవాలని మేము… https://t.co/Kcv9Xvn2mh pic.twitter.com/MYIfQQ7QGg
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
హుజూరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టడం వల్ల చుట్టు పక్కన ఉన్న 20 గ్రామాలు ఆగం అవుతాయి
పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, కలెక్టర్ ఇట్ల అందరికీ వినతి పత్రం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదు
రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అయితే నువ్వు చెప్పేదాకా నాకు కూడా తెల్వదు అన్నాడు
మా ప్రజల… https://t.co/wycKimpRSl pic.twitter.com/gfB5LPIpvv
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు pic.twitter.com/33BJIDGgaw
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026