Sanitation work | కోరుట్ల, జూలై 17: పారిశుధ్య పనుల్లో అలసత్వం పనికిరాదని, పకడ్బందీ స్వచ్ఛత పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్యర్యంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులు అదనపు కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈమేరకు స్థానిక సాయిరాంపురా కాలనీ, బిలాల్పురా, అయ్యప్పగుట్ట, ఎఖీన్పూర్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛత పనులను ఆమె తనిఖీ చేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రభలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మురుగుకాలువల్లో చెత్త, చెదారం చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. తీసిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. పట్టణంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ రవీందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, వార్డు ఆఫీసర్లు ఉన్నారు.