Lions Club | మల్లాపూర్, జూన్ 27: మండల కేంద్రంలోని శ్రీ వాసవిమాత ఆలయంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గంను ఎన్నుకున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అధ్యక్షునిగా దేవ మల్లయ్య. కార్యదర్శిగా క్యాతం సురేష్ రెడ్డి, కొశాధికారిగా మిట్టపల్లి మహేష్ రెడ్డి, ఉపాద్యక్షునిగా గౌరు నాగేష్, పీఆర్ఓగా మోర సతీష్ ను నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన దేవ మల్లయ్య మాట్లాడుతూ గ్రామాల్లో లయన్స క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవలను అందిస్తామాని పేర్కోన్నారు. అనంతరం వీరిని మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ డ్డి ఘనంగా సన్మానించారు. ఇక్కడ మాజీ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, శివ శ్రీనివాస్, సాదుల వెంకటస్వామి, ఏనుగు రాంరెడ్డి, తోట రాజారం, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.