Minister Seethakka | సారంగాపూర్, జూలై 5: బీర్ పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడెం గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతు గ్రామ సీనియర్ నాయకులు మహంకాళి రాజన్న మంత్రి సీతక్కను కోరారు. ఈమేరకు ఆయన హైదరాబాద్ లో గిరిజనశాఖ మంత్రి సీతక్కను శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు.
నాయకుపు గూడెం కండ్లపల్లి గ్రామానికి కీలో మీటర్ దూరంగా ఉంటుందని ఇక్కడ 62 కుటుంబాలు పూరి గుడిసెల్లో జీవిస్తున్నారని సరైన రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర సరుకులు అందుబాటులో లేవని, వారికి పక్కా ఇండ్లు లేవని మాడల్ కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు నిర్మించాలని, బస్సు సౌకర్యం కల్పించాలని వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతు వినతి పత్రం అందించినట్లు మహంకాళి రాజన్న పేర్కొన్నారు. స్పందించిన మంత్రి సీతక్క కలెక్టర్ కు సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.