Gundampally | గుండంపల్లి, మార్చి 24 : ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ నవోదయ ప్రవేశపరీక్షలో విజయాన్ని సాధించిన గుండంపల్లి గ్రామానికి చెందిన జక్కుల నవదీప్‌ను కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు ఘనంగా సన్మానించారు. గ్రామం నుండి తొలిసారిగా నవోదయ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నవదీప్ సాధించిన విజయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ అతడి భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మనర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడ్పుల పుష్పలతనర్సయ్య, బెజ్జరపు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, గంగాధర్, మధు గంగారెడ్డి, తిరుపతి, గంగరాజం, నరేష్ విజయ్, క్రాంతి, కిరణ్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.