Vemulawada | వేములవాడ, జూలై 9: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణ అధికారిగా ప్రతాప నవీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏఈవో గా రాజన్న ఆలయంలో విధులు నిర్వహించిన నవీన్ యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు. డీఈవో గా పదోన్నతి పొందిన అనంతరం కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనే సేవలందించగా ఇటీవల ఆయన బదిలీపై వేములవాడకు రాగా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
భీమేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్న అనంతరం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్ పలువురు ఉద్యోగులు ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి సన్మానించారు.