హుజూరాబాద్టౌన్, మార్చి 23: ఎందరో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులకు హుజూరాబాద్ నిలయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ హాకీ క్రీడాకారులు 10 మంది జాతీయస్థాయికి ఎంపికవడంతో బుధవారం సాయంత్రం స్థానిక హైస్కూల్ క్రీడా మైదానంలో బండ శ్రీనివాస్ సత్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పటణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు, సీనియర్ హాకీ క్రీడాకారులు తోట రాజేంద్రప్రసాద్, గనిశెట్టి ఉమామహేశ్వర్, గుడ్డేలుగుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, తిరునహరి శ్రీనివాస్, ఎండీ సజ్జు, ప్రదీప్, సన్నీ పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, మార్చి 23: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని వావిలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం జడ్పీటీసీ శ్రీరాం శ్యాం, ఎంపీపీ దొడ్డె మమతతో కలిసి 57 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాని కోరారు. ఇక్కడ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత, వైద్యుడు తులసీదాస్, ఆశ కార్యకర్తలు ఉన్నారు.