Press Day | కాల్వ శ్రీరాంపూర్ మే 3 : కాల్వ శ్రీరాంపూర్ లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలో విలేకరులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ పత్రికా విలేకరులు నిజాన్ని నిర్భయంగా రాయాలని అన్నారు. ఎక్కడో జరిగిన సమాచారాన్ని మన కళ్ల ముందు కనిపించే విధంగా చేసేవారే పత్రికా విలేకరులని వారి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి సిద్ధం సదానందం పటేల్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు రావి కోటేశ్వర్ లింగం, వీరగోని రమేష్ గౌడ్, అనుముల అనంతరెడ్డి, శ్రీమంతుల కొండాల్ చారి, మేకల మల్లేష్ యాదవ్, మెట్టు మధుకర్, గాదర్ల వెంకటరాజo. జిలకర రమేష్, మేడి దేవేందర్, అశోక్. వడ్లూరి రాజేశ్వరరావు, వోడ్నాల అజయ్, రామగళ్ల సురేష్ పాల్గొన్నారు.