Chigurumamidi | ఓదెలు కుమార్కు జాతీయ స్థాయి అవార్డు
చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 4 : చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఎన్వీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రం (తెలంగాణ-ఆంధ్ర ప్రదేశ్ )లో విద్యా రంగంలో విశిష్ట సేవలు చేసిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. ఓదెలు కుమార్ స్టేట్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు చేస్తూ ప్రయోగాల ద్వారా పాఠ్యాంశాలను విద్యార్థులకు చైతన్యవంతులను చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ సన్మానం ఈనెల 6 న (ఆదివారం) నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ ఛైర్మన్ లీలా కృష్ణ మోహన్ ఆహ్వానం పంపినట్లు ఓదెలు కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, మంగళ గిరి విద్యాధికారి శ్రీ బాబు పాల్గొంటారని తెలిపారు. ఈ అవార్డు ఎంపిక పట్ల మండల విద్యాధికారి జయప్రద, ఇందుర్తి, రేకొండ గ్రామాల సర్పంచ్లు సర్పంచ్ చింతపూల నరేందర్,ఆల్లెపు సంపత్, ఉపసర్పంచ్ అనిల్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, జేఏఓ చాడ కవిత, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఓదెలు కుమార్ స్వగ్రామం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో జాతీయస్థాయి అవార్డు ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

