State bandh | ధర్మారం,అక్టోబర్ 15: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొందరు అడ్డుకున్నందుకు నిరసన గా బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18వ తేదీ న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్ ను సమిష్టిగా విజయవంతం చేయాలని జాతీయ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి జంగ మహేందర్ కోరారు.
ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మహేందర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీల న్యాయమైన కోరిక నెరవేర్చడానికి చేస్తున్న ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు ,కుల సంఘాలు, వ్యాపార ,వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జీవో 9 ను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై కోర్టు స్టే విధించడం బాధాకరమని అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లో ఉన్న బడుగు బలహీన వర్గాలకు నోటి కాడి ముద్ద లాగేసినట్టు భావావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనదని మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మసానం పై బీసీలందరికీ అపారమైన నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఈ క్రమంలో బీసీలు అందరు కలిసి రోడ్ల పైకి వచ్చి తమ నిరసనలు తెలిపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా కలిగిన బీసీల వాటా ఏందో ఎంతో తెలువాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాలు అన్ని ఈ రోజు ఏకాదటి పై వచ్చి బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు .