Nandimedaram | ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన నందిమేడారం పీఏసీఎస్ చైర్మన్ బలరాం రెడ్డి
ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు.
Nandimedaram | ధర్మారం, మే 18 : ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు. కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన అడిగి తెలుసుకొన్నారు. ముఖ్యంగా ఎర్రగుంటపల్లి గ్రామంలో లారీ ల కొరత లేకుండా సకాలంలో వచ్చేటట్లు మాట్లాడి సమస్య పరిష్కరించారు. కేంద్రాలలో తూకం చేసిన వరి ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు.
కేంద్రాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. ఆయన వెంట పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఖిలావనపర్తి సర్పంచ్ మోతె కనుకయ్య, దొంగతుర్థి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్య, గోపాల్ రావు పేట ఉప సర్పంచ్ భారత స్వామి, డైరెక్టర్ దీటి శ్రీనివాస్, రచ్చ పల్లి ఉప సర్పంచ్ బైరి సురేష్, పార్టీ నాయకులు ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

