అత్యాధునిక ఫీచర్స్ ఉన్న ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా..? వివిధ రకాల కంపెనీల మోడళ్ల గురించి ఒకే చోట తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం! వెంటనే కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలోకి వచ్చేయండి! మీకోసం ‘నమస్తే తెలంగాణ’ శనివారం నుంచి ‘ఆటోషో’ను అందుబాటులోకి తెస్తున్నది.
ప్రముఖ కార్ల, ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్రధాన బ్యాంకులను ఒకే వేదికగా మీ ముందుకు తీసుకొస్తున్నది. హైరేంజ్ కార్లు, బైక్ల సమాచారం తెలుసుకోవడమే కాదు, బుక్ చేసుకునే అవకాశం ఇచ్చింది. నేడు, రేపు నిర్వహించే ఈ ఆటో షోలో సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించింది.
– కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 21